SBI: డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్.. కస్టమర్లకు ఎస్‌బీఐ బిగ్ అలర్ట్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-17 15:24:18.0  )
SBI:  డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్.. కస్టమర్లకు ఎస్‌బీఐ బిగ్ అలర్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో గత కొంత కాలంగా డీప్‌ఫేక్‌ వీడియోలు(Deepfake videos) వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్(Shaktikanta Das) పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్లుగా డీప్‌ఫేక్‌ వీడియోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటన మరవకముందే తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పేరుతో ఓ డీప్‌ఫేక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎస్‌బీఐ టాప్ మేనేజ్‌మెంట్‌ సభ్యుల పేరుతో " ఫథకాల్లో పెట్టుబడితో పెద్దఎత్తున రిటర్నులు" అంటూ కొన్ని నకిలీ వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయి.

అయితే ఈ వీడియోలపై ఎస్‌బీఐ స్పందించింది. ఆ వీడియోలు పూర్తిగా నకిలీవి అని స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్(X)' వేదికగా ఒక పోస్ట్ రిలీజ్ చేసింది."బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌(Bank Management)కు చెందిన వ్యక్తులమంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలను నమ్మకండి. ఆ వీడియోలో తెలిపిన పథకాలతో ఎస్‌బీఐకి లేదా బ్యాంక్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలలో ఫలానా ఫథకాల్లో పెట్టుబడులు పెట్టమని ప్రజలకు సలహా ఇస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైన విషయమని, ఎస్‌బీఐ ఎప్పుడూ అలాంటి పెట్టుబడి వీడియోలను ప్రచారం చేయదని పేర్కొంది. డీప్‌ఫేక్‌ వీడియోలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు బలికాకుండా జాగ్రత్త వహించాలని' ఓ పోస్ట్ చేసింది.

Advertisement

Next Story