విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

by Sridhar Babu |
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
X

దిశ,తల్లాడ : సప్తగిరి వెంచర్లో పనిచేస్తున్న కూలీ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన తల్లాడ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి తండ్రి అలుగు వెంకటస్వామి తెలిపిన వివరాలప్రకారం కొత్తగూడెం రోడ్డులో గల సప్తగిరి వెంచర్లో ఆంధ్రా రాష్ట్రం పల్నాడు జిల్లా బుచ్చివనేపాలెం గ్రామానికి చెందిన అలుగు వెంకటేశ్వర్లు (34) అనే వ్యక్తి కుటుంబంతో రెండు నెలల క్రితం కూలి పని నిమిత్తం తల్లాడ మండలానికి వచ్చారు. మంగళవారం పని నిమిత్తంలో ఐజాక్సు (కాంక్రిట్​ కలిపే వాహనం)లో కాంక్రీట్ కలుపుతున్న సందర్భంలో 11 కేఈ విద్యుత్ తీగలు ఐజాక్స్ బాడీకి తగిలింది.

అదే సమయంలో కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాన్ని పట్టుకున్న వెంకటేశ్వర్లు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో కింద పడిపోయాడు. ఆయన్ని స్థానికులు తల్లాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు సీపీఆర్ చేసిన తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పడంతో 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సప్తగిరి వెంచర్​ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story