- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య సిబ్బందిని నియమించేలా కృషి
దిశ,బెల్లంపల్లి : వైద్య సిబ్బందిని నియమించేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్, ల్యాబ్, వివిధ విభాగాలు, వార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అక్కడే ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. కావలసిన సౌకర్యాలను రోగులను అడిగారు.
వైద్య నిపుణులను నియమించాలని వారు కలెక్టర్ ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఆసుపత్రికి క్యాడర్ స్టెన్త్ జీవో జారీ చేసేలా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు నివేదించనున్నట్టు తెలిపారు. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతి పాదనలు పంపాలని, ఎక్కువ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీడి రవికుమార్ ను ఆదేశించారు. ఆసుపత్రి ప్రహరీ నిర్మాణం కోసం ప్రతి పాదనలు పంపాలని సూచించారు. ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.