Sobhita Dhulipalla: అక్కినేని కోడలు ఆసక్తికర పోస్ట్..!

by Anjali |   ( Updated:2024-12-17 15:52:51.0  )
Sobhita Dhulipalla: అక్కినేని కోడలు ఆసక్తికర పోస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శోభితా ధూళపాళ్ల(Sobhita Dhulipalla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. గూఢచారి(Gudachari), కాలకాండీ(Kalakandi), రామన్ రాఘవ్ 2.౦(Raman Raghav), ఘోస్ట్ స్టోరీస్(Ghost stories), కురుప్(Kurup), పొన్నియన్ సెల్వన్: I, పొన్నియిన్ సెల్వన్: II, (Ponnian Selvan), మంకీ మ్యాన్(Monkey Man), లవ్ సితార(Love Sitara) వంటి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. రీసెంట్‌గా అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya)తో ఏడడుగులు వేసి.. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.

వీరి పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ.. నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని వెల్లడించింది. నవ దంపతులిద్దరూ వివాహనంతరం టెంపుల్స్ విజిట్ చేశారు. ఇకపోతే శోభితా తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. శోభితా బంజారా అమ్మాయి గెటప్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు వైజాగ్‌లో రాత్రి దిగిన అస్పష్టంగా ఉన్న ఫొటోలు పంచుకుంటున్నంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More...

Naga Chaitanya : నాగచైతన్య, శోభితకు అలాంటి కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్నాడా?


Advertisement

Next Story