- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంగనకు మార్కెట్లో ఎంత రేటో చెప్పగలరా?.. కాంగ్రెస్ నేతపై ఫైర్ అయిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా పోటీ చేయనుంది. దీంతో కాంగ్రెస్ నేతలు కంగనాపై విమర్శలు చేశారు. యూపీకి చెందిన కాంగ్రెస్ మహిళానేత సుప్రియ శ్రీనాథే కంగనాపై అసభ్యకరమైన కామెంట్స్ చేసింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సుప్రియపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కంగనాపై కాంగ్రెస్ నేత విమర్శలు
వివరాల్లోకి వెళ్తే..గతంలో కంగనా సినిమాల్లో బోల్డ్ గా నటించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాథే. ఆ ఫొటో కింద మార్కెట్లో రేట్ ఎంతో చెప్పగలరా? అని రాసుకొచ్చారు. అయితే ఈ వివాదం కాస్త తీవ్రంగా మారడంతో ఆ పోస్ట్ ని తొలగించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం స్క్రీన్‌షాట్‌లు తీసి మరీ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. సుప్రియ వ్యాఖ్యలపై కంగనా కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు.
సుప్రియపై ఫైర్ అయిన కంగనా
కంగనా తన ఎక్స్ అకౌంట్ లో రాస్తూ..”డియర్ సుప్రియా జీ.. ఒక ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించా. క్వీన్ చిత్రంలోని అమాయకురాలిగా నటించడం నుంచి ధాకడ్ సినిమాలో గూఢచారిగా, మణికర్ణికలో దేవతగా, చంద్రముఖిలో రాక్షసిగా, రజ్జో మూవీలో వేశ్యగా.. తలైవి చిత్రంలో విప్లవ నాయకురాలిగా నటించా. ఆడపిల్లలను పక్షపాత సంకెళ్ల నుంచి మనమే విడిపించాలి. వారి శరీర భాగాలు చూడటం కంటే.. వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పరిస్థితుల వల్ల సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో రకంగా తిట్టడం మానుకోవాలి. ప్రతి స్త్రీ గౌరవానికి అర్హురాలు అని గుర్తించాలని” అని రాసుకొచ్చారు.
సుప్రియను సస్పెండ్ చేయాలని డిమాండ్
సుప్రియా వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ మాల్వియా, షహజాద్ పూనావాలా మండిపడ్డారు. సుప్రియ చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియను బర్తరఫ్ చేయాలని.. లేకుంటే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కంగనాపై సుప్రియ చేసిన వ్యాఖ్యలు హేయమైనవని..ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు బీజేపీ నేత షహజాద్ పూనావాలా. ఈ ఇష్యూపై ప్రియాంక గాంధీ మాట్లాడతారా? ఖర్గే సుప్రియాను సస్పెండ్ చేస్తారా? హథ్రాస్ లాబీ ఎక్కడ ఉంది అని ప్రశ్నల వర్షం కురిపించారు. నెటిజన్లు కూడా కంగనాకే మద్దతు తెలిపుతూ.. సుప్రియపై మండిపడుతున్నారు.
సుప్రియ అకౌంట్స్ హ్యాక్..!
సుప్రియ చేసిన వివాదాస్పద కామెంట్లపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. ఎవరో తన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేసి.. తప్పుడు పోస్టులు పెట్టారని ఎక్స్ వేదికగా తెలిపారు. తాను మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తానో.. సన్నిహితులకు, తనను చూసిన వారికి తెలుసని తెలిపారు. తన పేరుతో ఎక్స్ ఫేక్ అకౌంట్ పై రిపోర్ట్ చేసినట్లు తెలిపారు.