- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arvind Kejriwal :కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం మరోసారి రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతోంది. రేపు విచారణకు రావాల్సిందిగా సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు పంపగా విచారణ ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ చెప్పడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా ఎజెన్సీ సంస్థలు బీజేపీ చెప్పినట్లుగా వ్యవహరిస్తూ ఆమ్ ఆద్మీని టార్గెట్ చేస్తున్నాయని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలంటూ మాట్లాడే వారు అదే అవినీతి ఊబిలో కూరుకుపోవడం బహుశా ఈ 75 ఏళ్లలో ఇదే తొలిసారి అంటూ ఎద్దేవా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రులు జైలుకు వెళ్లి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచుతున్నారని సెటైర్లు వేశారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయన్నారు. కాగా రేపు సీబీఐ విచారణకు హాజరు కానున్న నేపథ్యలో ఎలాంటి సమాచారం రాబట్టబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
Himachal Pradesh | This has happened for the first time in 75 years that those who used to talk about agitation against corruption are seen drowning in the quagmire of corruption. Arvind Kejriwal's ministers went to jail and they are sharing knowledge to the world. Investigating… pic.twitter.com/c26OyVQExV
— ANI (@ANI) April 15, 2023