- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తమతో ఛాలెంజ్ చేశారని అడవికి నిప్పు పెట్టిన బీహారీ కార్మికులు! (వీడియో వైరల్)
దిశ, డైనమిక్ బ్యూరో: తమతో ఛాలెంజ్ చేశారని కొందరు బీహారీ కార్మికులు అడవికి నిప్పు పెట్టిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో అడవికి నిప్పు అంటుకొని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మంటలను ఆర్పేందుకు అటవీశాఖ అధికారులు శాయశక్తులా ప్రయత్నించిన అదుపులోకి రాకపోవడంతో.. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశాయి. నిప్పు పెట్టిన దుండగులు బీహర్ చెందిన కార్మికులుగా గుర్తించి నాగదేవ్ రేంజ్ అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
బీహార్ కు చెందిన కొందరు యువకులు ఖిసున్ లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఫేసర్ ఆలం, నజీఫర్ ఆలం, ఫిరోజ్ ఆలం, నూరుల్, సేలం అనే ఐదుగురు కూలీలు కొందరు స్థానిక వ్యక్తులతో గొడవ పడి, రాత్రి సమయంలో అడివికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో దుండగులు వీడియో తీస్తూ ఈ పని చేసింది తామేనని, బీహారీ కార్మికులతో ఛాలెంజ్ చేస్తే ఇలాగే ఉంటుందని చెప్పారు. దీనికి సంబందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దుండగులను పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. స్థానికులతో గొడవ పడి ప్రతీకారంతో ఈ పనికి ఒడిగట్టారని పౌరీ రేంజ్ డీఎఫ్ఓ అనిరుద్ స్వప్నిల్ ఓ ప్రకటన ద్వారా తెలిపాడు.