Bihar CM Nitish Kumar: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు..

by Javid Pasha |   ( Updated:2022-08-15 09:10:06.0  )
Bihar CM Nitish Kumar Announces 10 Lakh Jobs for people of Bihar
X

దిశ, వెబ్‌డెస్క్: Bihar CM Nitish Kumar Announces 10 Lakh Jobs for people of Bihar| ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో నిరుద్యోగం కూడా ఒకటి. దీనిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. కాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి తమ రాష్ట్ర నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు.

అంతేకాకుండా రాష్ట్ర యువతకు మరో 10 లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు నితీష్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 'బీహార్ రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు, మరో 10 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడించినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు నా ధన్యవాదాలు' అని తేజస్వీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ఉచిత విద్య, వైద్యం అందించడం ఉచితాలు ఇవ్వడం కాదు: కేజ్రీవాల్

Advertisement

Next Story