పేపర్‌ లీక్‌కు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు ?

by Shamantha N |
పేపర్‌ లీక్‌కు ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు ?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన నీట్‌- యూజీ 2024 పరీక్షపై తీవ్ర దుమారం రేగుతోంది. బిహార్‌లోనే నీట్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు సమాచారం వచ్చింది. కానీ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు, నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు టీమ్) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. కాగా.. బిహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలనాలు బయటకొస్తున్నాయి. పేపర్ లీకేజీ చేసిన గ్యాంగ్ లో బిహార్ ప్రభుత్వం విభాగంలో పనిచేసే జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు. గ్యాంగ్ తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఇంజినీర్ విచారణలో అంగీకరించాడు. కొందరు నీట్ అభ్యర్థులతో తాను టచ్ లో ఉన్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ చేసినందుకు స్టూడెంట్ల దగ్గర్నుంచి రూ.30 నుంచి రూ.32 లక్షల చొప్పున వసూలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు బయటకొచ్చాయి.

నీట్ స్కాంపై కొనసాగుతున్న విచారణ

ప్రస్తుతం నీట్ స్కాంపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 మంది నీట్‌ అభ్యర్థులకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మరో 9 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా.. ఈ ఆరోపణలపై జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇంకా స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed