- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు తీర్పు ఏకపక్షం.. 23,123 జాబ్స్ తొలగింపు అన్యాయం : దీదీ సర్కారు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : 2016 సంవత్సరంలో బెంగాల్ ప్రభుత్వం రిక్రూట్ చేసిన 23,123 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగిస్తూ కోల్‌కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అకస్మాత్తుగా ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయులను తొలగించడం వల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించింది. ఇవేమీ పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని సుప్రీంకోర్టును దీదీ సర్కారు కోరింది. 4,327 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే అక్రమంగా రిక్రూట్ అయ్యారని సాక్షాత్తూ సీబీఐ ఛార్జిషీట్‌లో ప్రస్తావించినా.. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం 23,123 మందిని జాబ్స్ నుంచి హైకోర్టు తొలగించడం అసంబద్ధమని బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Advertisement
Next Story