Bangladesh's Worst Floods: రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాకు మరో ఎదురుదెబ్బ

by Shamantha N |
Bangladeshs Worst Floods: రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాకు మరో ఎదురుదెబ్బ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ కు మరో షాక్ తగిలిపింది. బంగ్లాదేశ్ ని వరదలు ముంచెత్తాయి. బంగ్లాదేశ్‌లోని సుమారు 5 మిలియన్ల(50 లక్షల) మంది ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య 15కి చేరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సుమారు 5 నదులు పొంగిపొర్లుతున్నాయి. 11 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు “మూడు దశాబ్దాల్లో దేశం చూసిన అత్యంత దారుణమైన వరదలు ఇవే. దేశవ్యాప్తంగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ డైరెక్టర్ లియాకత్ అలీ ప్రకటనలో పేర్కొన్నారు.

సహాయకచర్యలకు ఇబ్బందులు

కాగా ప్రభుత్వం వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తోంది. వరద బాధితుల కోసం ఆహారం, అత్యవసర వైద్య సేవలు అందించడానికి 3,176 షెల్టర్లను ఏర్పాటు చేశారు. 639 వైద్య బృందాలు వరద బాధితులకు సాయం అందిస్తున్నాయి. రోడ్లన్నీ వరదతో నిండిపోవడంతో.. టెలికమ్యూనికేషన్ సేవలు, రవాణా సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరద బాధితులకు సాయం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, ఇటీవలే బంగ్లాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్ లో ఉండగా.. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed