Assam Police: ఆన్ లైన్ ట్రేడ్ స్కామ్.. అసోంలో 38 మంది అరెస్ట్

by vinod kumar |
Assam Police: ఆన్ లైన్ ట్రేడ్ స్కామ్.. అసోంలో 38 మంది అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లను నడుపుతున్న ఆరోపణలపై అసోం పోలీసులు 38 మందిని బుధవారం అరెస్ట్ చేశారు. వీరంతా అధిక లాభాలను ఎగజూపి పెట్టుబడిదారుల నుంచి మోసపూరితంగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపించారు. ఈ అరెస్టును సీఎం హిమంత బిస్వశర్మ ధ్రువీకరించారు. అక్రమ ఆన్‌లైన్ వ్యాపార మోసాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనేక ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు రాష్ట్రంలో సెబీ, ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించకుండా వ్యాపారం చేస్తున్నాయని తెలిపారు. అంతకుముందు రూ. 2,200 కోట్ల ఆర్థిక కుంభకోణానికి సంబంధించి దిబ్రూఘర్‌కు చెందిన బిషాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నానిల్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో ఒక అస్సామీ నటి, ఆమె భర్త కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed