- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tejashwi : నమాజ్ విరామం రద్దు.. అసోం సీఎం చౌకబారు రాజకీయమే : తేజస్వి
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : అసెంబ్లీలో ప్రతీ శుక్రవారం రెండు గంటల పాటు ముస్లిం ఎమ్మెల్యేలు తీసుకునే నమాజ్ విరామాన్ని అసోం ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఆర్జేడీ పార్టీ నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని అసోం సీఎం హిమంత బిస్వశర్మ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వ్యక్తిగత పాపులారిటీని పెంచుకునేందుకే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంటున్నారని తేజస్వి ఆరోపించారు.
‘‘శుక్రవారం రోజు అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేలకు రెండు గంటల పాటు నమాజ్ విరామం ఇచ్చే సంప్రదాయం బ్రిటీష్ కాలం నాటిది. తొలిసారిగా ఈ పద్ధతిని 1937 సంవత్సరంలో ముస్లిం లీగ్ నేత సయ్యద్ సాదుల్లా అమల్లోకి తెచ్చారు. దీన్ని రద్దు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ బిస్వజిత్ దైమరీకి నా ధన్యవాదాలు’’ అని అసోం సీఎం హిమంత బిస్వశర్మ పేర్కొన్నారు.
Advertisement
Next Story