Adhaar New Rule: కొత్త ఆధార్ కార్డ్ కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే: సీఎం సంచలన ప్రకటన

by karthikeya |
Adhaar New Rule: కొత్త ఆధార్ కార్డ్ కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే: సీఎం సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా ఆధార్ కార్డు (Adhaar Card) కోసం నమోదు చేసుకోవాలనుకున్న వాళ్లు తప్పనిసరిగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ సర్టిఫికేట్ (National Register Of Citizens Certificate) సమర్పించాల్సిందేనంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) సంచలన ప్రకటన చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్రంలో జనాభా లెక్కలతో పోల్చితే కొత్త ఆధార్ అప్లికేషన్లు (Adhaar Application) ఎక్కువగా ఉన్నాయని, అంటే అందులో కచ్చితంగా కొంతమంది అనుమానితులు ఉన్నారని అర్థమవుతోందని అన్నారు. అందుకే కొత్తగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవాళ్లు తమ ఎన్ఆర్‌సీ (NRC) నెంబర్‌ని జత చేయాలని సూచించారు.

అలాగే ఎన్ఆర్‌సీ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో బయోమెట్రిక్ (Biometric) పనిచేయకపోవడం వల్ల నిలిచిపోయిన వాళ్లు కూడా కొత్త ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని, కొంతమంది వారి ఎన్ఆర్‌సీ అప్లికేషన్ నెంబర్‌ (NRC Application number)ను పొందుపరుస్తున్నారని, దాన్ని పరిగణలోకి తీసుకోబోమని, కచ్చితంగా ఎన్ఆర్‌సీ కార్డ్ ఉన్నవారికి మాత్రమే ఆధార్ కార్డ్ అందిస్తామని సీఎం బిశ్వ శర్మ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడుతున్న చొరబాటుదారులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మారదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై అస్సాంలో ఎవరుపడితే వాళ్లు ఆధార్ పొందడం సాధ్యం కాదని, ముఖ్యంగా చొరబాటుదారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధార్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed