Assam assembly: అసెంబ్లీలో నమాజ్ విరామం రద్దు.. అసోం సీఎం బిస్వశర్మ కీలక నిర్ణయం

by vinod kumar |
Assam assembly: అసెంబ్లీలో నమాజ్ విరామం రద్దు.. అసోం సీఎం బిస్వశర్మ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం సీఎం హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతీ శుక్రవారం రెండు గంటల పాటు తీసుకునే నమాజ్ విరామాన్ని రద్దు చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ ఉత్పాదకతకు ప్రాధాన్యతనిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని, దీనికి మద్దతిచ్చిన స్పీకర్ బిశ్వజిత్ డైమరీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ పద్ధతిని 1937లో ముస్లిం లీగ్‌కు చెందిన సయ్యద్ సాదుల్లా ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ముస్లిం శాసన సభ్యులు నమాజ్ చేయడానికి ప్రతీ శుక్రవారం మద్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు విరామం తీసుకునేవారు. అనంతరం అసెంబ్లీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేవారు. ఇతర రోజుల్లో ఎలాంటి మతపరమైన ప్రయోజనాలు లేకుండా సభ నిర్వహించే వారు. దీంతో తాజా నిర్ణయంతో అన్ని రోజులూ సాదారణంగా సభా కార్యకలాపాలు జరగనున్నాయి. నమాజ్ రద్దు చేసే ప్రతిపాదనను మొదట స్పీకర్ బిస్వజిత్ నేతృత్వంలోని రూల్స్ కమిటీకి సమర్పించారు, అనంతరం ఈ నిబంధనను రద్దు చేయడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు.

Advertisement

Next Story