మూడు స‌ముద్రాలు క‌లిసే చోట 75 అడుగుల మువ్వ‌న్నెల జెండా

by Sumithra |
మూడు స‌ముద్రాలు క‌లిసే చోట 75 అడుగుల మువ్వ‌న్నెల జెండా
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భారతదేశ 75వ స్వాతంత్ర వేడుక‌ల్లో భాగంగా నిర్వ‌హించుకుంటున్న‌ 'అజాది కా అమృత్ మహోత్సవ్‌' దేశవ్యాప్తంగా ఉత్తేజాన్ని నింపింది. ఈ క్ర‌మంలోనే భారత సైన్యం గురువారం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్ర‌సిద్ధిచెందిన‌ ప్రదేశంలో 75 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారతదేశ దక్షిణ కొన, కన్యాకుమారి తీరంలోని వివేకానంద శిల స్మారక చిహ్నం వ‌ద్ద‌ హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల సంగమాన్ని సూచించే చోట ఈ భారీ మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లాడింది. తిరువనంతపురంలోని పాంగోడ్ మిలిటరీ స్టేషన్‌లోని ఉభయచర యోధులు ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన యాత్రలో భాగంగా తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కేరళలోని తిరువనంతపురం వరకు 75 కిలోమీటర్ల మేర జాతీయ జెండాలు పట్టుకుని 75 మంది సైనికులు కాలినడకన వెళ్లనున్నారు.

Advertisement

Next Story

Most Viewed