- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్మీ అమ్ములపొదిలోకి మరో ఆయుధం
దిశ, నేషనల్ బ్యూరో: ఆర్మీ అమ్ముల పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్.. నాగాస్త్ర-1 ఆర్మీలో అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లోని ‘సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్’ కంపెనీకి ఈ డ్రోన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా.. వాటిలో 120 ఆర్మీ ఆయుధ డిపోకు చేరాయి. అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఇలాంటి డ్రోన్లను ఆర్మీ.. విదేశాల నుంచి కొనుగోలు చేసింది. కాగా..ఈ డ్రోన్లు తయారు చేసిన తొలి స్వదేశీ కంపెనీగా అవతరించింది.
నాగాస్త్ర- 1 ప్రత్యేకతలు ఇవే..
వైమానిక దాడుల కోసం ఈ నాగాస్త్ర-1ను ఉపయోగిస్తారు. తొమ్మిది కిలోలు బరువు ఉన్న ఈ డ్రోన్ సుమారు 4 వేల 500 మీటర్ల ఎత్తు వరకు ఎగురగలదు. రాడార్లు గుర్తించకుండా దాడుల చేసే సామర్థ్యం ఈ డ్రోన్ కు ఉంది. యూఏవీ ఆధారిత వ్యవస్థతో పనిచేసే నాగాస్త్ర.. ఏ శుత్రు లక్ష్యాన్ని అయినా ఛేదించగలే సామర్థ్యం ఉంది. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 2 మీటిర్ల కచ్చితత్వంతో దాడిచేయగలదు. ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగాస్త్ర అప్పటివరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు. ఆత్మాహుతి డ్రోన్‌గా కూడా పని చేస్తుంది. 60 నిమిషాల పాటు ఇది ఎగురగలదు. మెన్ఇన్ లూప్‌లో 15 కిలోమీటర్లు, ఆటోనామస్ మోడ్‌లో 30 కిలోమీటర్ల రేంజ్ దీనికి ఉంది.
నాగాస్త్రకు నిఘా కెమెరాలు
అన్నివేళలా పనిచేసేలా నాగాస్త్రకు నిఘా కెమెరాలు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఈ స్వదేశీ డ్రోన్ మెరుగ్గా రూపొందించారు. మధ్యలో నిలిపివేయడం, రికవర్, రీయూజ్ వంటి ఫీచర్లు నాగాస్త్రలో ఉన్నాయి. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్‌ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రను తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం పారాషూట్ సదుపాయం ఉంది.