- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రొటిన్ కాదు’.. CM కేజ్రీవాల్ బెయిల్ తీర్పుపై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర సీఎంగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ తరుఫు లాయర్లు బెయిల్ ఇవ్వాలని కోరారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, ఎన్నికల్లో ప్రచారం చేయడమేమి ప్రాథమిక హక్కు ఏమి కాదని, ఈ సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు వాదించాయి. ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
తాజాగా కేజ్రీవాల్ బెయిల్ తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కేజ్రీవాల్ బెయిల్ తీర్పుపై ఇచ్చిన జడ్జిమెంట్.. రొటిన్‌గా ఇచ్చే తీర్పు కాదని విశ్వసిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ విషయంలో సీఎం కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చారని బయట చాలా మంది నమ్ముతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పుపై స్వయంగా కేంద్రమంత్రి అమిత్ షా పై విధంగా స్పందించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.