ఈ తేదీ నుంచే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

by Harish |
ఈ తేదీ నుంచే అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: హిందువులు పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్ర త్వరలో ప్రారంభంకానుంది. 2024 ఏడాదికి సంబంధించిన యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించారు. యాత్ర జూన్ 29, 2024 నుంచి ప్రారంభమై ఆగస్టు 19, 2024న ముగుస్తుంది. ముందస్తు రిజిష్ట్రేషన్లు ఏప్రిల్ 15న ప్రారంభమవుతాయని అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బందిని భక్తుల భద్రత కోసం మోహరిస్తారు. వారు ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ పోలీసుల మౌంటైన్ రెస్క్యూ టీమ్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

ఈ టీమ్ ఇన్‌చార్జ్ రామ్ సింగ్ మాట్లాడతూ, జూన్‌లో ప్రారంభమయ్యే యాత్ర రెండు నెలలపాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. వారికి సహాయం చేయడానికి సిబ్బందికి శిక్షణ అందిస్తున్నాము. కొండ ప్రాంతాలలో బలగాలకు పూర్తి శిక్షణ ఇవ్వడం ద్వారా జమ్మూ కశ్మీర్‌లోని భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే నైపుణ్యాన్ని ఈ సైనికులు సాధిస్తారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు, మంటలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లతో సహా విపత్తు నిర్వహణకు అవసరమైన అనేక రకాల నైపుణ్యాలను శిక్షణలో నేర్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,300 మంది సైనికులు పూర్తి శిక్షణ పొందినట్లు రామ్ సింగ్ చెప్పారు.

Advertisement

Next Story