Ajit Pawar: అజిత్ పవార్‌కు ఊరట.. గడియారం గుర్తు వాడుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి

by vinod kumar |   ( Updated:2024-10-24 11:52:35.0  )
Ajit Pawar: అజిత్ పవార్‌కు ఊరట.. గడియారం గుర్తు వాడుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్‌కు భారీ ఊరట లభించింది. ఎలక్షన్స్‌లో గడియారం గుర్తును అజిత్ వర్గం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ గడియారం గుర్తును ఉపయోగించకుండా నిరోధించాలని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. గడియారం గుర్తును అజిత్ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే శరద్ పవార్ వర్గానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కోర్టు ఆర్డర్స్ పాటించాలని, ఎన్నికలు ముగిసే వరకు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించబోమని హామీ పత్రం దాఖలు చేయాలని అజిత్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గతేడాది ఎన్సీపీలోని పలువురు ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బయటకు వెళ్లి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికల గుర్తు అయిన గడియారాన్ని సైతం అజిత్ వర్గానికే కేటాయించింది. శరద్ పవార్ వర్గాన్ని ఎన్సీపీ(ఎస్పీ)గా తేల్చింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన శరద్‌కు ఊరట లభించలేదు.

Advertisement

Next Story