ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. ఢీకొట్టబోయిన రెండు విమానాలు

by Mahesh |
ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. ఢీకొట్టబోయిన రెండు విమానాలు
X

ఖాట్మాండు: ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నిర్లక్ష్యం కారణంగా రెప్పపాటులో రెండు విమానాలు పక్క పక్క నుంచే దూసుకెళ్లాయి. రాడార్ హెచ్చరికలతో పైలట్లు అప్రమత్తం కాగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. దీనిపై నేపాల్ పౌర విమాన అధికారులు తీవ్రంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు నేపాల్ విమానయాన సంస్థ ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా తెలిపారు. శుక్రవారం రోజున నేపాల్ ఎయిర్స్ లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ విమానం కౌలాలంపూర్ నుంచి, ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీకొట్టే స్థితిలోకి వెళ్లాయని చెప్పారు. ఎయిరిండియా విమానం 19,000 అడుగుల నుంచి కిందికి దిగుతుండగా, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని నిరౌలా చెప్పారు. అయితే ఓ సమయంలో ఇరు విమానాలు దగ్గర దగ్గరగా వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టగా సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తేలింది. దీంతో సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed