- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
400 సీట్లు గెలుస్తామన్న బీజేపీ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన AICC చీఫ్ ఖర్గే
దిశ, వెబ్‌డెస్క్: 2024 లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని బీజేపీ అగ్రనేతలతో మొదలు పెడితే.. గల్లీ లీడర్లు వరకు అదే మాట చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటర్వ్యూలు ఇలా వేదికగా ఏదైనా కానీ 400 సీట్లు గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 400 సీట్లు గెలుస్తామని పదే పదే ప్రస్తావిస్తోన్న బీజేపీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పంజాబ్‌లోని అమృత్ సర్‌లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్‌లలో అసలు బీజేపీ ఉనికే లేదని.. అలాంటిది ఆ పార్టీ 400 సీట్లు ఎలా గెలుస్తోందని ఎద్దేవా చేశారు.
దాదాపు 80 నుండి 100 పార్లమెంట్ సీట్లున్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ మనుగడే లేదని.. అలాంటిది 400 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కర్నాటక, మహారాష్ట్రాలో కూడా బీజేపీ వీక్‌గానే ఉందని.. ఇక ఆ పార్టీ 400 సీట్లు ఎలా గెలుస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. 2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి బీజేపీ భారీగా ఎంపీ సీట్లు కోల్పోతుందని ఖర్గే జోస్యం చెప్పారు. కేంద్రంలో ఈసారి ఇండియా కూటమి అధికారం ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.