- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. తనకు ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోర్టును కోరారు. మద్యం కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా మనీ లాండరింగ్ కేసులో మార్చి 9న ఈడీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో గత 11 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా.. కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే సిసోడియాకు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు మార్చి 25కు వాయిదా వేసింది. సిసోడియా దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఈడీకి కోర్టు నోటీసులు పంపింది. కాగా నిన్నే సిసోడియా కస్టడీని ఏప్రిల్ 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే.