డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల కస్టడీ

by M.Rajitha |
డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల కస్టడీ
X

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం. గురువారం కోల్‌కతా ఆర్జీ కేర్ మెడికల్ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ లైంగిక దాడికి గురై మృతి చెందింది. ఈ వ్యవహారంపై డాక్టర్లు, నర్సులు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితుల్ని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విధుల్ని బహిష్కరిస్తామని మెడికోలు మమతా బెనర్జీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనాన్ని కలిగించడంతో.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించి, నిందితులను అవసరమైతే ఉరి తీయిస్తామని ప్రకటించారు. వెంటనే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

Next Story

Most Viewed