ఇండియన్ నేవీ కీలక నిర్ణయం

by samatah |
ఇండియన్ నేవీ కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. హౌతీ మిలిటెంట్లు ప్రతీ నౌకపై దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీటిని అడ్డుకునేందుకు ఇండియన్ నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, మధ్య అరేబియా సముద్రంలో నిఘాను పెంచింది. ఈ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలు నిర్వహించేందుకు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్‌లను మోహరించినట్టు తెలిపింది. ఇవే గాక మానవరహిత వైమానిక వాహనాలు, సముద్ర గస్తీ విమానాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో భద్రతను సమీక్షించేందుకు కోస్ట్ గార్డ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని పేర్కొంది. కాగా, ఇటీవల భారత తీరానికి దాదాపు 700 నాటికల్ మైళ్ల దూరంలోని ఎంపీ రుయెన్, పోర్ బందర్‌కు సుమారు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఎంపీ కెమ్ ప్లూటోపై డ్రోన్ అటాక్స్ జరిగిన విషయాన్ని నేవీ గుర్తు చేసింది.

Advertisement

Next Story

Most Viewed