- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
5 కోట్ల హాస్పిటల్.. నేడు 'హాంటెడ్ హౌజ్'!
దిశ, వెబ్ డెస్క్: బీహార్ లో మెరుగైన వైద్య సదుపాయాల కోసం నిర్మించిన ఆసుపత్రి నేడు హాంటెడ్ హౌజ్(Haunted House) గా మారింది. బీహార్ లోని ముజఫర్ పూర్ లో 10 సంవత్సరాల కిందట ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు. కానీ అది ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అయితే ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకుంది. పది సంవత్సరాల క్రితమే నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల దాంట్లో ఎవరూ లేకపోవడంతో దాన్ని ఆ ప్రాంతంలోని ప్రజలు 'హాంటెడ్ హౌజ్' గా పిలవడం మొదలుపెట్టారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో హస్పిటల్ ఆవరణ మొత్తం.. ఇంగ్లీష్ సినిమాల్లో కనిపించే దెయ్యాల కోటలాగా మారింది. హాస్పిటల్ భవన డోర్లు, లోపల వేసిన టైల్స్, గ్రిల్స్ అన్నిటినీ నాశనం చేశారు. చివరికి అది ఒక 'ఘోస్ట్ హౌజ్' లాగా మారేసరికి, అక్కడి గ్రామస్థులు రాత్రి పూట ఆ భవనాన్ని చూస్తేనే హడలెత్తిపోతున్నారు.
ముజఫర్ పూర్ లో జిల్లా కేంద్రానికి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలో సారయ్య పంచాయతీలోని చాంద్ పురా, పారులో 6 ఎకరాల స్థలంలో సుమారు రూ.5 కోట్లతో ఈ హాస్పిటల్ ను నిర్మించారు. కాగా ఇది 2015 లోనే పూర్తయింది. ఈ హాస్పిటల్ లో మొత్తం 30 కి పైగా పడకలు ఉండి, దాదాపు అన్ని పరికరాలు అమర్చి సిద్ధం చేసినా.. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం దీనిని ప్రారంభించలేకపోయింది. దీంతో ఏళ్ల తరపడి ఇలా ఖాళీగా ఉండేసరికి దొంగలకు అడ్డాగా మారి, దాంట్లోని వస్తువులన్నీ చోరికి గురయ్యాయి..
అయితే, ఈ హాస్పిటల్ పూర్తయితే అక్కడి ప్రజలకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయని అంతా భావించారు. కానీ ప్రభుత్వ అలసత్వం కారణంగా ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరేసరికి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.