- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉల్లి రైతులను ఆదుకోవాలి: నారా లోకేశ్
దిశ, వెబ్‌డెస్క్: ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు ఆర్ధికంగా తీవ్రంగా నష్ట పోతున్నారని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 34 లక్షలు క్వింటాల్ ఉల్లి దిగుబడి వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఉల్లి సాగు చేసిన రైతులు పంట కొనుగోలు లేకపోవటంతో, మద్దతు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎకరాకు 70 నుంచి 80 వేలు వెచ్చించి ఉల్లి పంటను వేసిన రైతులకు చివరకు కన్నీరు మిగిలిందని లోకేశ్ తెలిపారు. ఉల్లి పంటలు అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూల్ మార్కెట్ యార్డ్ కరోనా తీవ్రత కారణంగా మూతబడిందని చెప్పారు.
ప్రభుత్వం చెపుతున్నట్లుగా సచివాలయాల వద్ద కొనుగోలు జరగటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉల్లిపంటను రైతుల వద్ద నుండి వారి గ్రామంలోనే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.