అక్కడికి రావడానికి జగన్‌కు దమ్ముందా : లోకేష్

by srinivas |
అక్కడికి రావడానికి జగన్‌కు దమ్ముందా : లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రమేయంతో రామతీర్థం విగ్రహ ధ్వంసం జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారని, ఘటన జరగడానికి ముందురోజు కొండపైకి టీడీపీకి చెందినవారు వెళ్లారని అన్నారు. దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. శుక్రవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని, దీనిపై ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని, జగన్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. అంతేగాకుండా సీఎం జగన్‌కు దమ్ముంటే సింహాచలం ఆలయానికి రావాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story