- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘అమరం అఖిలం ప్రేమ’కు నిహారిక ప్రమోషన్స్..
దిశ, వెబ్‌డెస్క్: అమరం అఖిలం ప్రేమ.. ‘ఆహా’లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చాలా చక్కగా ప్లాన్ చేసింది మూవీ యూనిట్. తండ్రీ కూతుళ్ళ మధ్య ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకోగా.. ఆ తండ్రి, కూతురు మధ్య ప్రేమ పేరుతో మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఆ తండ్రి తన కూతురి ప్రేమకు అంగీకారం తెలిపాడా? అనేది కథ.
విజయ్ రామ్, శివశక్తి సచ్ దేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఆహా’లో సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అంత గొప్ప తండ్రీకూతుళ్ళ బంధం ఉన్న నాగబాబు, నిహారిక కొణిదెలను ప్రమోషన్స్‌లో భాగస్వామ్యం చేశారు. ఈ సందర్భంగా నిహారిక.. ‘తండ్రి నాగబాబు తనను ఎంతగా గారాబం చేసినా సరే, ఎలా లిమిట్స్‌లో పెడతాడో’ చెప్పగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పాడు నాగబాబు. మూవీ ట్రైలర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ పర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు నిహారిక, నాగబాబు. తండ్రిగా తన యాక్టింగ్ అదిరిపోయిందని తెలిపారు.
ఇక శ్రీకాంత్ అయ్యంగార్‌తో కలిసి నటించినట్లుగా లేదని, తండ్రితో మాట్లాడినట్లుగానే ఉందని తెలిపింది హీరోయిన్ శివశక్తి సచ్‌దేవ్. చాలా గొప్పగా నటించారని, తండ్రీ కూతుళ్లుగా మా ఇద్దరి మధ్య వచ్చిన ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని.. ఈ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుంటుందని తెలిపింది.