- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సులకు ఎన్-95 మాస్క్‌ల పంపిణీ
దిశ, హైదరాబాద్: ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రి (ఎర్రగడ్డ)లో కొవిడ్-19 వార్డులో పనిచేస్తున్న నర్సులకు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్-95 ఫేస్ మాస్క్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ తిలక్ మాట్లాడుతూ.. నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ వారి ‘డొనేట్ ఏ మాస్క్ సేవ్ ఏ నర్స్’ పిలుపునందుకుని దాతల ఆర్థిక సాయంతో చిన్న సహాయం చేస్తునట్టు తెలిపారు. కొవిడ్ 19 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సహకరించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు చిలుపూరి వీరాచారి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్తు వైరస్‌కు – మనిషికి జరుగుతున్న యుద్ధమని అన్నారు. కొవిడ్ -19 వైరస్ నివారణలో నర్సులు కంటికి కనిపించని శత్రువుతో తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్నట్టు తెలిపారు. వారికి తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు వెల్ టెక్ ఫౌండేషన్, అకౌంట్ నంబర్ 088701601000171, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ – సీఓఆర్పీ0000887, కార్పొరేషన్ బ్యాంక్, మల్కాజిగిరి బ్రాంచ్, హైదరాబాద్‌లో తమ సహాయాన్ని జమ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 91 95507 65346, 97000 15427 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వెల్ టెక్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రామ్ తిలక్, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీను రాథోడ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్, పారా మెడికల్ కో-ఆర్డినేటర్ వంశీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.