బెంగళూరు, ముంబై ప్యాసింజర్స్‌కు అస్సాం షాక్

by vinod kumar |
బెంగళూరు, ముంబై ప్యాసింజర్స్‌కు అస్సాం షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న మిగతా రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేశాయి. ఇంటర్ స్టేట్ ప్రయాణాలపై నిబంధనలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అస్సాం రాష్ట్రం బెంగళూరు, ముంబై నుంచి తమ రాష్ట్రానికి వచ్చే విమాన ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది.

ప్రయాణానికి 72గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే అస్సాంలోనికి అనుమతించనున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఒకవేళ ముంబై, బెంగళూరు నుంచి రైళ్ల ద్వారా ప్రయాణం సాగించాలనుకునే వారికి అస్సాం రైల్వే స్టేషన్లలోనే స్క్రీనింగ్ టెస్టులు జరపనున్నారు. లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed