విద్యార్థుల‌పై నిర్లక్ష్య ధోరణి తగదు

by Shyam |
విద్యార్థుల‌పై నిర్లక్ష్య ధోరణి తగదు
X

దిశ, న్యూస్ బ్యూరో
తెలంగాణ విద్యారంగం, విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష ధోరణి ప్రదర్శిస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. యూనివర్సిటీలకు సరైన బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదన్నారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వీసీ పోస్టులు, కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టివేస్తుందని సీతక్క మండిపడ్డారు. విద్యార్థులు తమ సమస్యను చెప్పుకునేందుకు అసెంబ్లీకి వస్తే పోలీసులు లాఠీచార్జి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యార్థులపై తెలంగాణ పోలీసులు ప్రవర్తించిన తీరును అసెంబ్లీ వేదికగా ఖండించారు. రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల ప్రస్తావనే లేదన్నారు. ముక్క తినండి చుక్క తాగండి అంటూ ప్రజలను తాగుబోతులగా మార్చేందకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల‌పై లాఠీచార్జి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.ఈ విషయంపై ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags: mulugu mla seethakka, student, police laaty charge, hyd, assembly

Advertisement

Next Story

Most Viewed