- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంద్రాణికి ధోనీ సలహాలు
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా జట్టుకు తొలిసారి ఎంపికైన వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తన కల అని.. సీనియర్ క్రికెటర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఇంద్రాణి చెప్పింది. తాను మెరుగైన వికెట్ కీపర్‌గా మారడానికి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కారణమని ఇంద్రాణి చెప్పింది. పశ్చిమ బెంగాల్ జట్టుకు అండర్ 19, అండర్ 23 ఆడిన ఇంద్రాణి అక్కడ బ్యాటర్‌గా మాత్రమే పలు మ్యాచ్‌లు ఆడింది. పశ్చిమ బెంగాల్ జట్టులో వికెట్ కీపర్లు ఎక్కువగా ఉండటంతో 2018లో జార్ఖండ్ జట్టుకు మారింది. ఆ సమయంలో రాంచీలోని గ్రౌండ్‌లో ఎక్కువగా సాధన చేసేది.
అప్పుడు ఎంఎస్ ధోనీని చాలా సార్లు కలిసినట్లు చెప్పింది. మహీ ఎన్నో సార్లు కీపింగ్‌పై ఇంద్రాణీకి సలహాలు ఇచ్చాడంటా. కీపర్ ఎలా ఉండాలి.. తన చుట్టు ఉండే 5 మీటర్ల పరిధిలో ఎలా వ్యవహరించాలనే విషయాలను ధోనీ తనకు చెప్పాడని ఇంద్రాణి వెల్లడించింది. ఎప్పటి నుంచో టెస్ట్ క్రికెట్ ఆడాలని ఇంద్రాణి కలలు కన్నది. కానీ ఆమె తొలిసారే మూడు ఫార్మాట్లకు ఎంపిక కావడంతో ఆనందంలో మునిగిపోయింది. తాను ఎక్కువగా పురుష క్రికెటర్లతోనే సాధన చేశానని.. వారి స్థాయి ప్రమాణాలు అందుకోవడానికి చాలా కష్టపడ్డానని ఇంద్రాణి చెబుతున్నది. ఇక తాను జార్ఖండ్ జట్టులో రాణించడానికి సీమా సింగ్ కూడా సాయం చేసిందని చెబుతున్నది.