- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఘవ లారెన్స్ ‘చెల్లి’కి లైంగిక వేధింపులు.. ఆడిషన్స్‌లో ముద్దు పెట్టాలని అడిగిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారు. అయితే.. కొంత మంది హీరోయిన్స్ వీటిని బహిరంగంగా చెప్పుకుంటారు. మరికొందరు మాత్రం మాట దాటి వేస్తారు. ఈ క్రమంలోనే ఓ యువ నటి తన పట్ల డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.
యూట్యూబర్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి.. ప్రస్తుతం బుల్లితెరపై నటిగా, యాంకర్‌గా రాణిస్తుంది తమిళ నటి దీపికా. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. తను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘రాఘవ లారెన్స్ సినిమాలో అతడి చెల్లిలి పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లాను. ఆల్‌మోస్ట్ నేనే సెలెక్ట్ అయ్యాను. కానీ, అక్కడ డైరెక్టర్ నన్ను సినిమాలో ఓ ముద్దు సీన్ ఉంది.
అది ఇక్కడ చేసి చూపించు అని అడిగారు. ఆడిషన్స్‌లో ముద్దు సీన్ చేయడం ఏంటని నేను చేయనని చెప్పాను. కానీ ఆ డైరెక్టర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు చెయ్యకపోతే ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నదానివి అవుతావు. చేస్తావా చెయ్యవా అంటూ బలవంతం పెట్టారు. అతడి మాటలు, ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆ టైంలో నేను ఎంతో ఆవేదనకు గురయ్యాను’’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో దీపిక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Guntur Kaaram : ఇంటర్వెల్‌లో బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న త్రివిక్రమ్?