టాలీవుడ్ అగ్ర హీరోల సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలల.. చేతిలో ఏకంగా 8 సినిమాలు!

by Anjali |
టాలీవుడ్ అగ్ర హీరోల సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలల.. చేతిలో ఏకంగా 8 సినిమాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. నటనతో, అందంతో, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ హీరోయిన్ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి28, బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108, పవన్ కళ్యాన్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’’ చిత్రంలో పవర్ స్టార్ ఈ బ్యూటీకి బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అలాగే హిందీ హీరో నితిన్, వక్కంతం వంశీ కలయికలో ‘‘నితిన్32’’ ,

బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘BoyapatiRapo’ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటిస్తోంది. జాతిరత్నాలు చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను నవ్వించిన నవీన్ పోలిశెట్టితో ‘‘అనగనగా ఒకరాజు’’ చిత్రంలో కనిపించనుంది. పంజా వైష్ణవ తేజ్ నటిస్తున్న ‘‘#PVT04’’ చిత్రంలో శ్రీలీలా ఇటీవలే ఎంపికైంది. ఈ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘Junior’ సినిమాలో కిరీటి సరసన నటిస్తోంది. ఇలా ఏకంగా 8చిత్రాల్లో నటిస్తూ ఈ భామ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

Advertisement

Next Story