వావ్.. ‘దేవర’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసిన కింగ్ నాగార్జున.. వీడియో వైరల్

by Kavitha |
వావ్.. ‘దేవర’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసిన కింగ్ నాగార్జున.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర’. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం విశేషం. కాగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం బ్లాక్ బస్టర్ గ్రేస్ సంపాదించుకున్నది. ప్రస్తుతం రూ.500 కోట్లకు చేరువలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. అయితే ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌తో పాటు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక అందులో ఆయుధ పూజ సాంగ్ అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వింటుంటేనే గూస్‌బంప్స్ వచ్చేస్తున్నాయి అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు.

ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగ్.. వీకెండ్‌లో స్టార్టింగ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి వెల్‌వమ్ విషెస్ చెప్తాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగ్ ‘దేవర’ మూవీలోని ఆయుధ పూజ సాంగ్‌కు మాస్ స్టెప్స్ వేశారు. తారక్ గ్రేస్‌ను మ్యాచ్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.. ఇక ఈ డ్యాన్స్ చూసిన చాలామంది సూపర్, అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed