- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్త్రీల శరీరాలపై పంచులేయడమే మగాళ్లకు సరదా .. మేమూ రివేంజ్ తీసుకుంటాం
దిశ, సినిమా: ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు సమాజంలోనూ కామెడీకోసం మహిళలపై జోకులు వేసే పురుషులంటే అస్సలు నచ్చదంటోంది జామీ లివర్. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఆడవారిని దారుణంగా హేలన చేయడం తనకు మింగుడు పడలేదని, ‘పంచింగ్ బ్యాగ్స్ ఫర్ జోక్స్.. ఫర్ మేల్ కమెడీయన్స్’ అనే ట్యాగ్‌ను అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేకపోయానని చెప్పింది. ‘నేనెప్పుడూ ఇలాంటి అనుభవం పొందలేదు. కానీ మగవాళ్లు ఎప్పుడూ మాపై జోకులు వేయడానికి బదులుగా పంచ్ లైన్లు విసురుతారు. అది నాకు మాత్రమే కాదు నాలాంటి ఆడవాళ్లకు అంతగా నచ్చలేదు. మహిళలు తమాషాగా ఉండరని సమాజ అభిప్రాయం కూడా. అందుకే కావోచ్చు మాకు పంచులు వేసే అవకాశం లేకుండాపోయింది. అయితే కొన్నేళ్లుగా స్త్రీలు చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు. మమ్మల్ని మేము నిరూపించుకుంటున్నాం. మాకోసం మేము నిలబడటం ప్రారంభించాం’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి:
లేడీస్‌కు సంబంధించిన ఫీల్డ్ కాదని హేళన చేశారు.. నిర్మాతగా మారడంపై దియా