యాంకర్ కామెంట్స్‌కు ఖంగుతిన్న విశ్వక్‌సేన్‌.. అయోమయంలో నెటిజన్లు

by Hamsa |
యాంకర్ కామెంట్స్‌కు ఖంగుతిన్న విశ్వక్‌సేన్‌.. అయోమయంలో నెటిజన్లు
X

దిశ, సినిమా: సాధారణంగా టాలీవుడ్‌లో జరిగే ప్రెస్‌మీట్స్‌కు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌కు ఆ ఈవెంట్‌ను కలర్‌ఫుల్‌గా ముందుకు నడిపించడానికి యాంకర్లను నియమించుకుంటారు నిర్మాతలు. ఆ ఈవెంట్‌ను తమ మాటలు, పొగడ్తలు, సమయస్పూర్తితో ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొంత మంది యాంకర్లు అత్యుత్సాహాంతో చేసే కామెంట్స్‌ అక్కడికి అతిథిగా వచ్చిన వారిని, సినీ ప్రముఖులను ఇబ్బంది పెడుతుంటాయి.

తాజాగా, బిగ్‌బాస్‌ ఫేం యాంకర్‌ స్రవంతి చొక్కారాపు ఇలాంటి ఓ సంభాషణ ద్వారా విశ్వక్‌సేన్‌ను ఇబ్బంది పెట్టింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రోటి కపడా రొమాన్స్‌ అనే చిత్రం సాంగ్‌ విడుదల కార్యక్రమంలో విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. స్టేజీ మీదకు విశ్వక్‌ను పిలిచిన తర్వాత ఆయనను ఉద్దేశించి ఈ మద్య మీరు, నేను ఎక్కువ ఫంక్షన్స్‌కు అటెండ్‌ అవుతున్నాం.. మన ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చి ఫంక్షన్స్‌ వచ్చినందుకు రెమ్యూనరేషన్‌ కలిసి మాట్లాడుకుందాం.. అనేసరికి అక్కడ ఉన్న విశ్వక్‌సేన్‌ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

వెంటనే నీకు రెమ్యూనరేషన్‌ ఇస్తారేమో.. నాకు ఎవరూ డబ్బులు ఇవ్వరు. ఇచ్చినా నేను తీసుకోను.. అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. అయితే అక్కడున్న వాళ్లంతా యాంకర్‌ స్రవంతి గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు.. ఈ సారి ఎందుకు ఇలా మాట్లాడేసింది? ఏంటి అని అయోమయంలో పడిపోయి పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed