సాయి పల్లవితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

by Prasanna |   ( Updated:2024-06-07 06:17:09.0  )
సాయి పల్లవితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గ్రాఫ్ పడిపోయింది. ఒకప్పుడు ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు.. వేయి కళ్ళతో ఎదురు చూసే వాళ్ళు. కానీ, ఇప్పుడు ఈ సినిమా అయిన హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్ పెద్దగా హిట్స్ సాధించలేకపోయాడు. లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషీ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు.

"ఫ్యామిలీ స్టార్" చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఇది కూడా హిట్ అవ్వలేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ నిరాశపరిచింది. విజయ్ నుంచి మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు విజయ్, సాయి పల్లవి కలిసి ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అందమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే, ఈ మూవీలో విజయ్ సరసన సాయి పల్లవి జతకట్టనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు సరైన హిట్ లేదు.. విజయ్ కు సాయి పల్లవి క్రేజ్ కూడా ఉంటే మూవీ పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed