- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల రోజులు టార్చర్ అనుభవించా.. కానీ ఒళ్లు అమ్ముకోలేదు: స్టార్ నటి
దిశ, సినిమా: ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఈజీ కాదు. కేవలం గ్లామర్ ఒక్కటుంటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ ఉన్నప్పటికీ అందం తప్పనిసరి. కొంతమందికి తొందరగా అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా ఒక టాలెంటే. కొంతమంది నటీనటులు అవకాశాలు తగ్గడంతో ఇతర పనులు చేసుకుంటూ ముందుకు సాగుతారు.
మరికొంతమంది ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే తాజాగా ఓ నటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ‘‘మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. తర్వాత చాలా కాలం వరకు నాకు చాన్స్ లు రాలేదు. డిప్రెషన్ లోకి వెళ్లాను. ఆసుపత్రికి తీసుకెళ్తే నేను బతకడం కష్టమని చెప్పారు. సినీ ఇండస్ట్రీ అంటే చాలా మంది ఎన్నో రకాలుగా ఊహించుకుంటారు. కానీ నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను.
ఇక్కడ మహిళలకు ముళ్ల జీవితం. ఆఫర్లు వస్తే ఒకే కానీ.. తేడా కొడితే మాత్రం కష్టం. అవకాశాల కోసం చీరలు కూడా అమ్మాను. తర్వాత సీరియల్స్ లో విలన్ పాత్రల్లో ఆఫర్లు వచ్చాయి. నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. నన్ను చులకనగా చూసి.. కమిట్మెంట్ అడిగారు. ఏం చేయాలో అర్థం కాక నరకం అనుభవించా. రిజెక్ట్ చేయడంతో టార్చర్ చేశారు. అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. అయినా నేను ఒళ్లు అమ్ముకోలేదు. ఒళ్లు చూపించను అంతే’’ అంటూ బుల్లితెర నటి మల్లిక జాగుల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.