నేడు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ పుట్టినరోజు

by Prasanna |
నేడు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ పుట్టినరోజు
X

దిశ, సినిమా : అర్జున్ కపూర్ 1985, జూన్ 26 న జన్మించాడు. నిర్మాత బోనీ కపూర్, మోనా షౌరేల కుమారుడు. కల్ హో నా హో (2003) , వాంటెడ్ (2009) వంటి సినిమాలకు సహాయ దర్శకుడు, సహాయ నిర్మాతగా పనిచేసిన తర్వాత హబిబ్ ఫైసల్ దర్శకత్వంలో ఇషాక్ జాదే (2012) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అర్జున్. ఈ సినిమాలోని తన నటనకు ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డుకు నామినేట్ అయ్యాడు. దివంగత నటీ శ్రీదేవి ఆయనకు సవతి తల్లి. జాహ్నవి, ఖుషి అర్జున్ చెల్లెళ్ళు అవుతారు. ఒక ఇంటర్వ్యూలో తండ్రి రెండో పెళ్లి గురించి అడిగినప్పుడు "అప్పుడ మాకు ఏమి తెలియదు చిన్న వయసు. చాలా బాధ ఉండేది. కానీ ఏం చేయగలం? ఎన్ని రోజులని కోర్టులు చుట్టూ తిరగాలి? అని చెప్పుకొచ్చాడు. నేడు తన 39 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed