Tumbbad Re-Release : చరిత్రను తిరగరాసిన "తుంబాడ్".. 50 కోట్ల వైపు పరుగులు

by Mahesh |   ( Updated:2024-10-05 11:25:25.0  )
Tumbbad Re-Release :  చరిత్రను తిరగరాసిన తుంబాడ్.. 50 కోట్ల వైపు పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్(re-release) ట్రెండ్ పెద్ద ఎత్తున నడుస్తోంది. పెద్ద హీరోలు తమ కొత్త సినిమాను అభిమానులకు అందించడంలో లేట్ అవుతున్నారు. దీంతో అభిమానులు నిరాశ చెందకుండా హీరోల హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు సైత్ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. దీంతో పెద్ద హీరోల అభిమానుల మధ్య రీ రిలీజ్ సినిమాల కలెక్షన్లలోనూ పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో ఓ చిన్న సినిమా రీ రిలీజ్ కావడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది. భారీ సినిమాలను తట్టుకొని 50 కోట్ల వసూళ్లు వైపు పరుగులు పెడుతుంది.

కొత్త సినిమాలో పోటీ పడుతూ.. కోట్లు కొల్లగొడుతునున్న సినిమా "తుంబాడ్"("Thumbad"). ఈ చిత్రం 2018 లో హింది భాషలో రిలీజ్ కాగా.. మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. నాటి పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అయినప్పటికీ రూ. 12.30 కోట్లు కొల్లగొట్టి.. చరిత్ర సృష్టించింది. అనంతరం ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం, పెద్ద పెద్ద డైరెక్టర్లకు సైతం నచ్చడం, వారు బహిరంగ వేదికల్లో తుంబాడ్ సినిమా చూడని వారు చాలా మిస్ అవుతారని చెప్పడంతో భారీ హైప్స్ పెరిగిపోయాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్.. అధికారికంగా "తుంబాడ్" సినిమాను రీ రిలీజ్ చేశారు.

ఈ సినిమా సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ రిలీజ్ తక్కువ థియేటర్లు దక్కడంతో.. అన్ని షోలు హౌస్ ఫుల్ గా మారాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ హిట్ చిత్రం స్త్రీ 2 హవా తగ్గడంతో ఒక్కసారిగా తుంబాడ్ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి. రెండు వారాల్లో ఏకంగా రూ. 30 కోట్లను వసూలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే వరుస సెలవులు, దసరా హాలీడేస్ ఉండటం, పెద్ద సినిమాలు లేకపోవడంతో మెల్ల మెల్లగా థియేటర్లు సైతం పెరుగుతున్నాయని. ఈ సినిమా మరో పది రోజులు ఆడితే.. రూ. 50 కోట్లు కొల్లగొడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు అతి త్వరలో పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ క్రమంలో పార్ట్1 పై ఇంత క్రేజ్ పెరగిందని పలువురు చెబుతున్నారు. ఈ "తుంబాడ్" రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించగా , ఆనంద్ గాంధీ క్రియేటివ్ డైరెక్టర్‌గా, ఆదేశ్ ప్రసాద్ కో-డైరెక్టర్‌గా ఉన్నారు. దీనిని మితేష్ షా, ప్రసాద్, బార్వే, గాంధీ రాశారు. ఈ చిత్రాన్ని సోహమ్ షా, ఆనంద్ ఎల్. రాయ్, ముఖేష్ షా, అమిత షా నిర్మించారు.

Advertisement

Next Story