MEGASTAR: ఈ సంవతర్సరం పుట్టిన రోజు మరింత ప్రత్యేకం.. కల్యాణ్ బాబుకు విష్ చేస్తూ రేర్ ఫొటో షేర్ చేసిన మెగాస్టార్

by Anjali |   ( Updated:2024-09-02 15:00:31.0  )
MEGASTAR: ఈ సంవతర్సరం పుట్టిన రోజు మరింత ప్రత్యేకం.. కల్యాణ్ బాబుకు విష్ చేస్తూ రేర్ ఫొటో షేర్ చేసిన మెగాస్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికన ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. పవన్ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లతో మారుమోగిస్తున్నారు. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్ కూడా ఉంది. ఈ హీరో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్‌సింగ్ ను నేడు రీరిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద గబ్బర్‌సింగ్ ఫ్లెక్సీలకు పువ్వులు చల్లూతూ సందడి స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కళ్యాణ్ బాబు బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన ఓ రేర్ ఫొటో షేర్ చేస్తూ పవన్ కు విష్ చేశారు.

‘ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలోపెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి.. రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు పవన్ కల్యాణ్’ అంటూ మెగాస్టార్.. పవర్ స్టార్‌కు బర్త్ డే విషెష్ తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed