- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
దిశ, సినిమా : సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు తమకు నచ్చిన సినిమాలు థియేటర్లలో విడుదల అవుతాయా అని ఎదురు చూస్తారు.ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు టిల్లూ స్క్వేర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఏవో చూద్దాం. ఈ వారం థియేటర్లలో ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. అందులో తెలుగులో టిల్లూ స్క్వేర్, కలియుగ పట్టణంలో,ది గోట్ లైఫ్,క్రూ, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ : ది న్యూ ఎంపైర్ సినిమాలున్నాయి.
తెలుగులో..
టిల్లు స్వ్కేర్
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన మూవీ డీజే టిల్లు. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూమీ టిల్లూ స్వ్కేర్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, సిద్దూ జొన్నలగడ్డ నటించారు. కాగా, ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కలియుగ పట్టణంలో
తెలుగులో థియేటర్లలో విడుదల కాబోతున్న మరో సినిమా,కలియుగ పట్టణంలో. రమాకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ వారంలో విడుదల కానుంది.
మళయాలం
దిగోట్ లైఫ్ : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ ఈ వారం థియేటర్లలలో సందడి చేయనుంది.ఈ సినిమా కోసం మలయాళ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ గతంలో వచ్చిన గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు కదా. ఇప్పుడీ మాన్‌స్టర్‌వెర్స్ ఫ్రాంఛైజీ నుంచి గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ పేరుతో మరో మూవీ రాబోతోంది. ఈ మూవీ కూడా ఇంగ్లిష్ తోపాటు పలు ఇతర భాషల్లోనూ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.
హిందీ
క్రూ : కరీనా కపూర్, కృతిసనన్,టబు ఎయిర్ హోస్టెస్‌గా నటించిన సినిమా క్రూ. బంగారం సమ్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీ హిందీలో ఈ వారం రిలీజ్ కానుంది.