- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూవీ ప్రమోషన్స్‌కు రూపాయి కూడా లేదు.. హెల్ప్ చేయండంటూ వీడియో రిలీజ్ చేసిన ఆ హీరో
దిశ, సినిమా : సినిమా అనే రంగుల ప్రపంచంలో నటీనటులుగా పేరు తెచ్చుకోవాలని తపన పడుతున్నవారు ఎందరో.. మరికొందరు తెరపై స్టార్ డమ్ అందుకున్న దానిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంటారు. ఇప్పుడు కొత్త నటీనటులు కొత్త ఆఫర్లు అందుకుంటూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. మరికొందరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే ఎన్నో కష్టాలు, అవమానాలు చవిచూడాలి. అన్నింటిలో మొదటిది, ఆర్థిక సమస్యలను హ్యాండిల్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఒక యంగ్ హీరో అలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాడు. నెగెటివ్ రోల్స్ తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన కథానాయకుడిగా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కానీ సినిమాను జనాలకు చేరువ చేసేందుకు డబ్బులు లేవు. ప్రమోషన్ కోసం ఏ విధంగానైనా సహాయం చేయమని ప్రేక్షకులను వినోద్ కిషన్ కోరుతున్నాడు.
తెలుగులో మొదటిసారి పేకమేడలు మూవీలో హీరోగా చేశాను.. లక్ష్మణ్ అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది.. సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ మూవీ ప్రమోట్ చేయడానికి రూపాయి కూడా లేదు.. రూ.5, లేదా రూ.10 ఎంతైనా సరే ఈ క్యూఆర్ కోడ్ కు స్కాన్ చేసి పంపించండి. ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రమోషనల్ వీడియో ఓపెన్ అవుతుంది. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగమే అని అర్దమైపోయింది.