Mr Bachchan Movie: మాగ్నటిక్ పెర్ఫార్మన్స్ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి థర్డ్ సింగిల్ అప్‌డేట్

by Prasanna |
Mr Bachchan Movie: మాగ్నటిక్ పెర్ఫార్మన్స్ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి థర్డ్ సింగిల్ అప్‌డేట్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ మేరకు వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నారు. ఇందులో నుంచి రిలీజైన ప్రతి అప్‌డేట్ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక మొదటి రెండు సింగిల్స్, టీజర్ థంపింగ్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇందులో భాగంగా తాజాగా థర్డ్ సింగిల్ ‘జిక్కీ’కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు థర్డ్ సింగిల్ ఆగస్టు 2న రిలీజ్ కాబోతుందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మెస్మరైజింగ్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. ఈ సాంగ్ వారి ఆన్-స్క్రీన్ రొమాన్స్‌కు సెలబ్రేషన్‌గా మాగ్నటిక్ పెర్ఫార్మన్స్‌తో మెలోడీని బ్లెండ్ చేసేలా ఉండబోతోందని పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story