‘స్వామివారి ఆశీస్సులతోనే మూవీ సక్సెస్ అయ్యింది’.. ‘35 చిన్న కథ కాదు’ టీమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |
‘స్వామివారి ఆశీస్సులతోనే మూవీ సక్సెస్ అయ్యింది’..  ‘35 చిన్న కథ కాదు’ టీమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘35 చిన్న కథ కాదు’ కాదు చిత్రం సెప్టెంబరు 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించిన ఈ సినిమాకు నందకిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నివేదా థామస్, విశ్వదేవ్‌, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైంది.

అయితే ‘35 చిన్న కథ కాదు’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. చిత్ర యూనిట్ శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా నివేదా థామస్, విశ్వదేవ్, డైరెక్టర్ నంద కిశోర్ పలువురు నటీనటులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. టీమ్ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని, స్వామివారి ఆశీస్సులతోనే సినిమా సక్సెస్ అయ్యిందని, స్వామివారి పదాల చెంత నుంచే మూవీ విజయ యాత్రను స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed