స్టార్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం.. ఇక సినిమాలు చేయనంటూ ప్రకటన

by Shiva |   ( Updated:2023-06-20 06:10:16.0  )
స్టార్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం.. ఇక సినిమాలు చేయనంటూ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో కార్తీతో 'ఖైదీ', విలక్షణ నటుడు కమల్ హాసన్ తో 'విక్రమ్' వంటి సినిమాలతో తమిళ ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు లోకేశ్ కనగరాజన్. దాదాపుగా ఆయన తీసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురించాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన తలపతి విజయ్ తో కలిసి 'లియో' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ క్వింటెన్ టరెంటీనోలా పది 10 సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో లోకేశ్ తీసుకున్న నిర్ణయంతో తమిళ ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. 'నాకంటూ పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు. అదేవిధంగా ఇండస్ట్రీలోనే ఉండిపోవాలని కూడా ఏమాత్రం ఆసక్తి లేదు. సినిమాలు తీయాలన్న కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. కేవలం షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మొదలు పెట్టి.. పూర్తిగా పట్టు వచ్చాక దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాను. పది సినిమాలు తీశాక.. ఇండస్ట్రీ నుంచి వైదొలుగుతా" అంటూ లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు.

సినిమా మేకింగ్ అనేది అంత తేలిక కాదని, ఓ దర్శకుడికి పేరు వచ్చేలా సినిమా తీయాలంటే చాలా విషయాలపై దృష్టి సారించాలన్నారు. నిర్మాత, సంగీత దర్శకుడి నుంచి ఎన్ఓసీ తీసుకోవాలన్నాడు. నాకు అలా సహకరించి, అలా తనతో పనిచేసిన నిర్మాతలు, నటులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇక రెండోసారి లియో సినిమా ద్వారా విజయ్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు లోకేశ్ కనగరాజన్.

Advertisement

Next Story