- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీరియల్ షూటింగ్లో తీవ్రంగా గాయపడిన నటి.. ఆమె ఎవరంటే..?
దిశ, సినిమా : దియా ఔర్ బాతీ సీరియల్‌తో దీపికా సింగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే సిరీస్ తెలుగులోకి ‘ఈతరం ఇల్లాలు’ పేరుతో డబ్ చేయబడింది. తెలుగులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత దీపిక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంగళ లక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తోంది. ఈ సీరియల్లో ఆమె మంగళ పాత్ర చేస్తుంది. ఈ సీరియల్ సెట్ లో దీపిక గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సిరీస్ షూటింగ్ ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది,.
దీపికాతో అవార్డు వేడుక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, బలమైన గాలి కారణంగా ఆమె వెనుక ఉంచిన ప్లైవుడ్ షీట్ దీపికపై పడింది. దీపిక అరుస్తూ కుప్పకూలిపోయింది. ఆమె భయంకరంగా అరవడంతో ప్రొడక్షన్ టీం వెంటనే రంగంలోకి దిగి దీపికపై పడిన ప్లైవుడ్‌ని తొలగించారు. దీపిక వెన్నులో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. గాయాలు ఉన్నప్పటికీ, దీపిక షూటింగ్ కొనసాగించడానికి ప్రయత్నించింది. నొప్పిని తగ్గించడానికి ఐస్ ప్యాక్‌లు కూడా ఉపయోగించారు. కానీ ఆమె వెనుక భాగంలో వాపు కారణంగా, షూటింగ్ మధ్యలోనే ఆపేసారు .
వెన్నులో బలమైన గాయం కారణంగా, కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీపికా సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. దియా ఔర్ బాతీతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన.. ఆమె ఆ సీరియల్ దర్శకుడునే ప్రేమించి వివాహం చేసుకుంది.