నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు థాంక్స్.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు థాంక్స్.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ తనయుడు మంచు మనోజ్ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కానీ ఆయన గత కొన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇక మనోజ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది వీరిద్దరూ ఓ పాపకు తల్లిదండ్రులయ్యారు. ఏప్రిల్‌లో పాప పుట్టగా.. ఇటీవల అన్నప్రాశన కూడా చేశారు. అయితే మంచు మనోజ్ సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు పోస్టులు పెడుతూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలుపుతున్నారు. తాజాగా, మనోజ్ తన భార్య భూమా మౌనిక బర్త్ డే కావడంతో విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

‘‘మన కుటుంబానికి హృదయానివి నువ్వే. పిల్లలను, మన పెంపుడు జంతువులపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తావు. అది నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్ చేస్తుంది. నా జీవితంలోని సూపర్ ఉమెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు థాంక్స్. పిల్లల కోసం నువ్వు రూపొందించిన ఎడ్యుకేషన్ గేమింగ్ యాప్ లాంఛ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నేను నీకు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉంటాను. లవ్ యూ మై సన్‌షైన్. అన్నింటికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా తన భార్యతో దిగిన ఫొటో షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed